Breaking News

మేకప్‌కే నాలుగున్నర గంటలు.. చాలా కష్టపడ్డా: శ్రీవిష్ణు

Published on Tue, 10/01/2024 - 16:58

శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్‌’. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించగా,  మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా 'శ్వాగ్' అని టైటిల్ పెట్టాం.  

శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది.   

నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్ గా అనిపించింది. వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది.  

సినిమా చాలా బావొచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.

చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరి ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నా కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.

రాజ రాజ చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని నమ్మి రాజరాజ చోర సినిమా ఇచ్చింది. చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి సక్సెస్ అవుతుంది.

ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్ లో చాలా మంచి ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుంది. ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్ ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.

ఇందులో నేను చేసిన నాలుగు క్యారెక్టర్లలో సింగ తప్ప మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్. అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్ కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం. ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.

ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా ఉండాలి. ఎలాంటి కన్ఫ్యుజన్ ఉండకూడదు. శ్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటునే చాలా కొత్తగా ఉంటుంది.


ఇందులో మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా నటించారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్ ఆమెది. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా ఉంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్ తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాయి. బీజీఎం థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.

ఇది కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ ఉంటుంది. సర్ ప్రైజ్ లు ఉంటాయి. ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.

కొత్తగా ఒక థ్రిల్లర్ మూవీ  చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఓ ఎంటర్ టైనర్ చేస్తున్నాను.  

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)