Breaking News

మూడురోజుల్లో సింగిల్‌ కలెక్షన్స్‌.. మీ థియటర్స్‌కే హీరో హీరోయిన్లు

Published on Mon, 05/12/2025 - 12:04

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘సింగిల్‌’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడురోజుల్లోనే రూ. 16.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా  నటించారు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా దర్శకుడు కార్తీక్‌ రాజు తెరకెక్కించారు.  అల్లు అరవింద్‌ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

సింగిల్‌ సినిమాలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా విడుదలరోజే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న సింగిల్‌ చిత్రం.. ఊహించినదానికంటే భారీ కలెక్షన్స్‌ సాధిస్తుంది. శ్రీవిష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. దీంతో ఈ చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని పలు థియేర్స్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సందడి చేస్తున్నారు.

సింగిల్‌ సినిమా జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులు శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా మీ ఊరి థియేటర్స్‌కే నేటి నుంచి వచ్చేస్తున్నారు. 
మే 12న సాయంత్రం 6గంటలకు వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌, మే 13న ఉదయం 11గంటలకు రాజమండ్రి అప్సర, మధ్యాహ్నం 2గంటలకు ఏలూరులోని ఎస్‌వీసీ, సాయంత్రం 6గంటలకు విజయవాడలోని రాజ్‌ యువరాజ్‌ థియేటర్స్‌కు వారు రానున్నారు. మే 14న ఉదయం 11గంటలకు గుంటూరు మైత్రీ, మధ్యాహ్నం 2గంటలకు నరసరావుపేట గీతా మల్టీఫ్లెక్స్‌లో చిత్ర యూనిట్‌ సందడి చేయనుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)