Breaking News

రెండోరోజు భారీగా పెరిగిన 'సింగిల్‌' కలెక్షన్స్‌

Published on Sun, 05/11/2025 - 10:10

ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంగా బాక్సాఫీస్‌ వద్ద ‘సింగిల్‌’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండోరోజు కలెక్షన్స్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా  నటించారు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా దర్శకుడు కార్తీక్‌ రాజు తెరకెక్కించారు.  అల్లు అరవింద్‌ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

సింగిల్‌ సినిమాలో శ్రీవిష్ణు వన్‌లైన్‌ పంచ్‌లతో పాటు వెన్నెల కిశోర్‌ కామెడీ టైమింగ్‌ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటిరోజు మంచి టాక్‌ రావడంతో రెండోరోజు భారీగా కలెక్షన్స్‌ పెరిగాయి. డే1 రూ. 4.15 కోట్లు రాగా, రెండోరోజు రూ. 7.05 కోట్లు వచ్చాయి. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. శ్రీవిష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సింగిల్‌ సినిమా కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు.

సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ వరుస హిట్లు అందుకున్న శ్రీవిష్ణు శ్వాగ్‌ (Swag) సినిమాతో కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే, ఇప్పుడు సింగిల్‌ సినిమాతో దుమ్మురేపాడని చెప్పొచ్చు. మూడు జనరేషన్‌ల మైండ్‌సెట్‌లను వినోదాత్మకంగా తెరపై చూపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సినిమాలు ఏవీ లేవు. ఇది సింగిల్‌ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో మరింతగా కలెక్షన్స్‌ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)