డబుల్‌ ధమాకా

Published on Sat, 03/01/2025 - 00:19

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఫిబ్రవరి 29న తన పుట్టినరోజుని పురస్కరించుకుని డబుల్‌ ధమాకా ఇచ్చారాయన. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రానికి ‘మృత్యుంజయ్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్‌ జంటగా నటించిన చిత్రమిది.

రమ్య గుణ్ణం సమర్పణలో లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఒంగోలు నేపథ్యంలో... శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు మేకర్స్‌.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి. నిర్మించనున్నారు. ‘ఒంగోలు పట్టణం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. శ్రీవిష్ణు హిలేరియస్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: హేమ–షాలిని, సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు