Breaking News

కొత్త భాష మాట్లాడాను: శ్రీ విష్ణు

Published on Sun, 06/21/2026 - 00:53

‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ఒక పీరియడ్‌ సినిమా. 90లలో జరిగిన ఒక ఘటనకి ఫిక్షన్‌ జోడించి కోన వెంకట్‌గారు ఒక అద్భుతమైన కథని సిద్ధం చేశారు. ఈ చిత్రం కోసం ఒక కొత్త భాషను మాట్లాడాను... దాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటించిన చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన వెంకట్‌ సమర్పణలో స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ఒరియా పిల్ల...’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని శనివారం నిర్వహించారు.

ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సిధ్‌ శ్రీరామ్‌ పాడారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్‌ సమయంలో నాతో పాటు అందరూ చాలా సరదాగా పని చేశాం’’ అన్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీ విష్ణు ఈతరం ఆల్‌రౌండర్‌. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో పని చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ వంద శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది’’ అన్నారు జానకి రామ్‌. ‘‘ఈ సినిమాలో మంచి వినోదంతో పాటు చక్కని సంగీతం ఉంది’’ అని వెంకటకృష్ణ కర్నాటి చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్, నటుడు షైన్‌ టామ్‌ చాకో, లిరిక్‌ రైటర్‌ భాస్కరభట్ల, ఎడిటర్‌ ఛోటా కె. ప్రసాద్, రచయిత బీవీఎస్‌ రవి మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)