Breaking News

వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Published on Fri, 09/20/2024 - 12:53

ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇ‍ప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.

తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్‌లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్‌ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?

(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)