Breaking News

మాకు చెప్పడానికి మీరెవరు?.. స్పిరిట్ మేకర్స్‌పై రైతు కూలీ ఆగ్రహం

Published on Tue, 07/14/2026 - 20:23

యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌ తొలిసారి పోలీసాఫీసర్‌  పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్  బ్యానర్‌లో భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్, ప్రభాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది.

తాజాగా ఈ మూవీ టైటిల్‌పై వివాదం నెలకొంది. ఇప్పటికే ఈ పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పేరుతో ఓ రైతు కూలీ మూవీని నిర్మించారు. తాజాగా ఈ టైటిల్ పేరుతో హిందీ వర్షన్‌ రిలీజ్ చేయవద్దని నిర్మాతలకు టీ సిరీస్‌ నోటీసులు పంపించింది. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదని నోటీసుల్లో పేర్కొంది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ (OTT), యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటామని తెలిపింది.

తాజాగా టి- సిరీస్ నోటీసులపై స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, శ్రీ వెంకటేశ్వర్లు  స్పందించారు. టీ సిరీస్ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. మా సినిమా ఎక్కడ, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకోవాలనేది మా వ్యక్తిగత విషయం.. మాపై నిబంధనలు పెట్టడానికి టీ సిరీస్‌కు ఎలాంటి హక్కు ఉందని నిర్మాతలు ప్రశ్నించారు. 

మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాము.. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న  స్పిరిట్‌ హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోండి.. దానికి మాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సినిమా హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించడం లేదని చిత్ర బృందం తెగేసి చెప్పింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)