Breaking News

‘బిగ్‌బాస్‌’ లోకి సౌరభ్‌ గంగూలీ.. రెమ్యునరేషన్‌ ఎంతంటే..?

Published on Wed, 07/22/2026 - 14:46

ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్‌ రియాలటీ షో 'బిగ్ బాస్'.  తెలుగు, హిందీ మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ఈ రియాల్టీ షోకి మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులో అయితే ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే పదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికి వరకు అన్ని భాషల్లో ఈ రియాల్టీ షోకి సినిమా తారలే హోస్ట్‌గా వ్యవహరించారు. హిందీలో సల్మాన్‌ ఖాన్‌, తెలుగులో నాగార్జున, నాని, కన్నడలో కిచ్చా సుదీప్‌, తమిళ్‌లో కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి హోస్ట్‌లుగా వ్యవరించారు. అయితే బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి సినిమా నటుడు కాదని ఓ క్రికెటర్‌ హోస్ట్‌గా వ్యవరించబోతున్నాడు. ఆయన ఎవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ.

బిగ్‌బాస్‌ బెంగాలీకి హోస్ట్‌గా.. 
ఇప్పటి వరకు భాషల వారిగా వేర్వేరు సమయాల్లో బిగ్‌బాస్‌ షో ప్రారంభం అయ్యేది. కానీ ఈ సారి మాత్రం ఒకేసారి ఆరు భాషల్లో బిగ్‌బాస్‌ రియాల్టీ షో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ నెలలో ఈ రియాల్టీ షో కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే బిగ్‌బాస్ బెంగాలీ షోకి గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు జియోహాట్‌ స్టార్‌  ఓ ప్రత్యేక వీడియో ద్వారా అధికారిక ప్రకటన వెల్లడించింది. హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్‌ ఖాన్‌, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్‌ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో మోహన్‌లాల్‌ వ్యవహరించబోతున్నారు.

భారీ పారితోషికం.. 
బిగ్‌బాస్‌ బెంగాలీ షో కోసం గంగూలీ రూ. 125 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్‌బాస్ బెంగాలీ సీజన్ 3 రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గంగూలీని రంగంలోకి దించారు నిర్వాహకులు. గతంలో జీ బెంగాలీలో వచ్చిన 'దాదాగిరి అన్‌లిమిటెడ్' క్విజ్ షోతో బుల్లితెరపై హోస్ట్‌గా గంగూలీ సంచలన విజయం సాధించారు. ఇప్పుడు బెంగాలీ బిగ్‌బాస్‌ను మరింత గ్రాండ్‌గా రీ-లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి కెప్టెన్‌గా క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆకట్టుకున్న గంగూలీ.. హోస్ట్‌గా బుల్లితెరపై ఎలా అలరిస్తాడో చూడాలి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)