Breaking News

‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్‌కి నవ్వాను: అనిల్‌ రావిపూడి

Published on Tue, 11/21/2023 - 11:54

‘సౌండ్‌ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత  హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్‌లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్‌ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మించిన ఈ చిత్రానికి సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్‌ ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్‌ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. 

సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు.

‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్‌ సంజయ్‌  శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)