Breaking News

52 ఏళ్ల మలైకాతో డేటింగ్‌.. 32 ఏళ్ల కుర్రాడు ఏమన్నాడంటే..

Published on Thu, 03/12/2026 - 10:19

బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మలైకా అరోరా.. వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.

 ఆ కుర్రాడు మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. అతని పేరు సోరబ్‌ బేడి. మోడల్‌, టీవీ నటుడు. మలైకా వయసు 52 ఏళ్లు అయితే.. సోరబ్‌ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ పార్టీలో హగ్‌ చేసుకొని సెల్ఫీ దిగడంతో డేటింగ్‌ రూమర్స్‌ బయటకు వచ్చాయి.  అయితే ఈ డేటింగ్‌ రూమర్స్‌ని సోరబ్‌ కొట్టి పడేశాడు. మలైకా, తాము మంచి స్నేహితులం మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మలైకాతో స్నేహం ఎలా ఏర్పడిందో వివరించాడు.

అలా పరిచయం.. 
డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు  నా మోడలింగ్ రోజుల్లో ర్యాంప్‌పై నడిచే అవకాశం ఇచ్చారు. నేను వారితో స్నేహం చేశాను. వారితో కలిసి పార్టీలకు వెళ్లడం ప్రారంభించాను. ఒక పార్టీలో, నేను నా గురువుల ద్వారా మలైకాను కలిశాను. ఆమె డెల్నాజ్, వాహ్బిజ్‌లకు కూడా సన్నిహితురాలు. అందువల్ల, మలైకా, నేను స్నేహితులమయ్యాం. అంతకు మించి మా మధ్య ఏమి లేదు’ అని సోరబ్‌ చెప్పుకొచ్చాడు.

మలైకాతో పార్టీ.. తొలిసారి కాదు
ఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇలాంటి రూమర్స్‌ వల్ల వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు. ట్రోల్‌ చేసే ప్రతిఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. అయినా మలైకాతో పార్టీ చేసుకోవడం నాకు ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మలైకాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. అప్పుడు నేను ఫేమస్‌ కాదు. ఎవరికీ తెలియకపోవడంతో అవి వైరల్‌ కాలేదు. ఇప్పుడు నేను కూడా తెలిసిన ముఖం కావడంతో డేటింగ్‌ రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే. కానీ కొంతమంది దాన్ని భిన్నంగా చూస్తున్నారు’ అని సోరబ్‌ మండిపడ్డారు.

మలైకా..స్పెషల్ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌
90వ దశకంలో బాలీవుడ్‌లో మలైకా తన హవాను కొనసాగించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కి స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా రాణిస్తోంది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)