Breaking News

నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!

Published on Thu, 04/11/2024 - 12:52

ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్‌, హాస్య నటుడు సూరి.

(ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!)

విష్ణువిశాల్‌ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్‌, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు.

ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్‌ తండ్రి రమేష్‌.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్‌ సలామ్‌ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్  పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్‌ ఆయన తండ్రి రమేష్‌, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

అందులో టైమ్‌ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్‌ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!)

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)