Breaking News

నీలాంటివాళ్లు గుడికి ఎందుకొస్తారో? బాలీవుడ్‌ నటుడిపై ట్రోలింగ్‌

Published on Sun, 04/30/2023 - 08:41

బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా తేలిన నటుడు సూరజ్‌ పంచోలి తాజాగా ముంబైలోని సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. శనివారం ఆలయాన్ని దర్శించిన అతడికి పూజారులు విఘ్నేశ్వరుడి ఫోటోతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. వాటిని తీసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన అక్కడి కెమెరాల వైపు చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు దిగాడు. ఈ క్రమంలో తన షూలను చేతితో పట్టుకుని పక్కన పెట్టారు. మళ్లీ అదే చేతితో వినాయకుడి ఫోటోను పట్టుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నటుడిపై మండిపడుతున్నారు. 'నీ కాలి షూ ముట్టుకుని ఆ భగవంతుడి ఫోటో పట్టుకున్నావు. కొంచెమైనా బుద్ధుందా? అసలు ఏ పద్ధతి తెలియకుండా గుడికి ఎందుకొస్తారో?', 'షూ ముట్టుకున్న తర్వాత కనీసం నీ చేతులు కడుక్కోవచ్చు కదరా బాబూ' అని ట్రోలింగ్‌ చేస్తున్నారు.

కాగా నటి జియా ఖాన్‌ 2013, జూన్‌ 3న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సుమారు ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ లేఖ ఆధారంగా నటి ప్రియుడు సూరజ్‌ పంచోలిని పోలీసులు నిందితుడిగా భావించారు. ఈ కేసును దీర్ఘకాలంగా విచారించిన సీబీఐ ఏప్రిల్‌ 28న సూరజ్‌ పంచోలి నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఇన్నాళ్లకు తనకు న్యాయం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు సూరజ్‌ పంచోలి. కాగా సూరజ్‌ పంచోలి చివరగా టైం టు డ్యాన్స్‌ షోలో కనిపించాడు.

చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్‌, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)