Breaking News

జియా డిప్రెషన్‌లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు

Published on Sun, 04/30/2023 - 14:37

బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌.. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిశ్శబ్ధ్‌ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు జనాల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. కానీ తను కోరుకుంది వేరు. స్వచ్ఛమైన ప్రేమ కోసం తాపత్రయ పడింది. అక్కున చేర్చుకునే తోడు కోసం తల్లడిల్లింది. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి కోసం ఎదురు చూసింది. కన్నీరు కారిస్తే తుడిచే చేయి కోసం వెంపర్లాడింది. కానీ అవేమీ జరగలేదు.

తను దిగులుగా, దీనంగా ఉన్న సమయంలో సూరజ్‌ పంచోలి ద్వారా జీవితంలో వెలుగు చూసింది. అయితే, ఆ వెలుగు దీర్ఘకాలం ఉండదని తెలుసుకోలేకపోయింది. అతడిని మనసారా ప్రేమించిన ఆమె బరువెక్కిన గుండెతో 2013లో ఆత్మహత్య చేసుకుంది. పంచోలిని తను ఎంతగా ప్రేమించిందో.. అదే సమయంలో అతడు ఎంతగా వేధించాడో ఆరు పేజీల ఆత్మహత్య లేఖలో రాసుకుంది జియా ఖాన్‌. అయితే నటి ఆత్మహత్యకు సూరజ్‌ ప్రేరేపించినట్లు బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు రెండు రోజుల క్రితమే అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సూరజ్‌.. జియా ఖాన్‌తో తన రిలేషన్‌షిప్‌పై స్పందించాడు. 'నేను జియాతో ఐదు నెలలు మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో నాకు తెలియదు కానీ ఆమె ప్రేమ కోరుకుంది. అది ఒక్క ప్రియుడు నుంచి మాత్రమే కాదు తన కుటుంబం నుంచి కూడా ప్రేమను ఆశించింది. ఆమె కుటుంబం తనను అర్థం చేసుకోవాలని, అండగా నిలవాలని తాపత్రయపడింది. ఆమె కుటుంబంలో సంపాదించేది తను ఒక్కరే కాబట్టి ఫ్యామిలీని పోషించేందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో ఒత్తిడికి కూడా లోనైంది.

జియా డిప్రెషన్‌లో ఉందని ఆమె తల్లి రబియా ఖాన్‌కు కూడా చెప్పాను. కానీ తను పట్టించుకోలేదు. అప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ఎవరికీ అంత అవగాహన లేదు కూడా! జియా, నేను ప్రేమించుకోవడానికి ముందు 2012లో సాధారణ స్నేహితుల్లానే ఉన్నాం. ఆ సమయంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తను చేయి కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను లండన్‌లో ఉన్న జియా తల్లి రబియాజీకి ఫోన్‌ చేసి చెప్పాను. ఆమె తర్వాతి ఫ్లైట్‌లో ముంబై వస్తానంది. కానీ నెలలు గడిచినా రానేలేదు. ఎక్కడైనా తల్లీకూతుళ్ల మధ్య ఇలాంటి ప్రేమే ఉంటుందా? తను ఇంటిసభ్యుల ప్రేమను కోరుకుంది' అని చెప్పుకొచ్చాడు సూరజ్‌ పంచోలి.

చదవండి: నటి వనితా విజయ్‌ కుమార్‌ మాజీ మూడో భర్త కన్నుమూత
పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటున్న సల్మాన్‌ ఖాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)