Breaking News

కర్ణాటక ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన స్టార్‌ సింగర్‌

Published on Tue, 05/06/2025 - 15:02

బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ బెంగళూరులో నిర్వహించిన సంగీత కచేరీ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సోనూ, తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘సారీ కర్ణాటక.. నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ’ అని ఇన్‌స్టాలో  పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది?
గత నెల  25-26 తేదీల్లో బెంగళూరులోని ఈస్ట్‌ పాయింట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో సోనూ నిగమ్‌ ఒక సంగీత కచేరీ నిర్వహించారు. కచేరీ సందర్భంగా, కొంతమంది ప్రేక్షకులు సోనూ నిగమ్‌ను కన్నడ పాటలు పాడాలని గట్టిగా కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో సోనూ చిరాకు పడ్డారు. ఈ క్రమంలో ఓ అభిమాని కన్నడ పాటల డిమాండ్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ డిమాండ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని ఆరోపణలు వచ్చాయి.

కన్నడ సంఘాల ఆగ్రహం
సోనూ నిగమ్‌ వ్యాఖ్యలు కన్నడ భాష, సంస్కృతిని అవమానించాయని భావించిన కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. KRV బెంగళూరు సిటీ యూనిట్‌ అధ్యక్షుడు ధర్మరాజ్‌, సోనూ వ్యాఖ్యలు భాషల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాయని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరు పోలీసులు సోనూ నిగమ్‌కు నోటీసులు జారీ చేసి, వారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ బ్యాన్‌
ఈ వివాదం నేపథ్యంలో, కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సోనూ నిగమ్‌పై బ్యాన్‌ విధించినట్టు తెలుస్తోంది. ఈ నిషేధం కారణంగా సోనూ కర్ణాటకలో సంగీత కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. అయితే, ఈ బ్యాన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సోనూ నిగమ్‌ బెంగళూరు కాన్సర్ట్‌ వివాదం కన్నడ భాష, సంస్కృతి చుట్టూ సున్నితమైన అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, కన్నడిగుల ఆగ్రహం, పోలీసు విచారణ, ఫిల్మ్‌ ఛాంబర్‌ బ్యాన్‌ వంటి పరిణామాలు ఈ ఘటనను మరింత హైలైట్‌ చేశాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)