Breaking News

ఓటీటీలో సోనియా అగర్వాల్‌ హార్రర్, థ్రిల్లర్‌ సినిమా

Published on Thu, 08/08/2024 - 11:36

హార్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా ఈ ఏడాది జులైలో 7/G చిత్రం విడుదలైంది. ఇందులో ‌ సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించింది. హార్రర్‌ కథా చిత్రంగా దీనిని డ్రీమ్‌ హౌస్‌ పతాకంపై హరూన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది. 

7/జీ బృందావ‌న కాల‌నీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా అగ‌ర్వాల్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది. ఆ సినిమా ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకే ఈ చిత్రానికి 7/G అనే టైటిల్‌ పెట్టారు. తమిళ్‌లో మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా తమిళ్‌ ఆహాలో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, తెలుగు వర్షన్‌ను కూడా త్వరలోనే ఆహా విడుదల చేయనున్నట్లు సమాచారం. 

7/జీ మూవీకి హ‌రూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే నిర్మాతగా కూడా ఉన్నారు. ఇందులో సోనియా అగ‌ర్వాల్‌తో పాటు స్మృతి వెంక‌ట్‌, సిద్ధార్థ్ విపిన్ కీల‌క పాత్ర‌లలో నటించారు. ఈ చిత్రంలో హీరోగా న‌టించిన సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ కూడా అందించడం విశేషం. సోనియా అగ‌ర్వాల్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, రొటిన్‌ స్టోరీ కావడంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆగ‌స్ట్ 9 నుంచి ఆహా త‌మిళ్‌లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)