Breaking News

ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా..

Published on Fri, 07/26/2024 - 08:34

చావు గురించి ఆలోచించడం మంచిదే అంటున్నాడు హాలీవుడ్‌ యాక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కెను రీవ్స్‌. అవును, తను చెప్తోంది నిజమేనని, మరణం గురించి ఆలోచించడం ఒకరకంగా మంచి విషయమేనంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌. 21వ శతాబ్దంలో నాలుగో గ్రేటెస్ట్‌ యాక్టర్‌గా కీర్తి గడించిన కెను రీవ్స్‌.. ద బుక్‌ ఆఫ్‌ ఎల్స్‌వేర్‌ అనే నవల రాశాడు. దీన్ని త్వరలోనే రిలీజ్‌ చేయనున్నాడు. 

మరణం గురించే ఆలోచన
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్‌ ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. అంటే మరణాన్ని తలుచుకుంటే బతికి ఉన్నంత కాలం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నటుడు చెప్తున్నాడు.

సినిమాలు..
ఇది కరెక్టే అనిపించడంతో సోనమ్‌ కపూర్‌ ఈ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. కాగా సోనమ్‌.. సావరియా సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఢిల్లీ 6, ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌, ఐషా, థాంక్యూ, బేవకూఫియాన్‌, భాగ్‌ మిల్కా భాగ్‌, ఖుబ్సూరత్‌, నీర్జ, ప్యాడ్‌ మ్యాన్‌, వీరు ది వెడ్డింగ్‌, సంజు, ద జోయా అక్తర్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన బ్లైండ్‌ సినిమాలో చివరగా కనిపించింది.

చదవండి: మళ్లీ తల్లి కాబోతున్నాను

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)