Breaking News

తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్‌

Published on Tue, 02/11/2025 - 12:07

నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌(Sonam Kapoor). కపూర్‌ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు  ఫోటోషూట్స్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్‌.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్‌ కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బిడ్డ పుట్టాక మారిపోయాను
కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్‌ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాని సోనమ్‌ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట​కి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్‌. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్‌ చెప్పుకొచ్చింది.

నచ్చితేనే చేస్తా
నా పర్సనల్‌ లైఫ్‌ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్‌గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్‌ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్‌ వివరించింది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)