Breaking News

నిజం చెప్పండి తారలూ.. మీరు ప్రెగ్నెంట్స్‌ కదూ!

Published on Fri, 07/16/2021 - 17:41

Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్‌ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్‌ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్‌ మీడియాలో కామన్‌ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్‌ కపూర్‌, నేహా కక్కర్‌లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు.

కోవిడ్‌ వల్ల ఏడాది కాలంగా లండన్‌లోనే ఉండిపోయిన సోనమ్‌ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్‌ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్‌ జాకెట్‌ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్‌ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్‌ వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను 2018లో పెళ్లాడింది.

మరోవైపు బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ నేహా కక్కర్‌ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్‌ప్రీత్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్‌ప్రీత్‌ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్‌ కేరింగ్‌ చూస్తుంటే కన్ఫామ్‌గా ఆమె గర్భవతే అని డిసైడ్‌ అయిపోతున్నారు ఫ్యాన్స్‌. దీనికి తోడు 'ఇండియన్‌ ఐడల్‌ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)