Breaking News

నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్‌ కపూర్‌

Published on Sat, 08/27/2022 - 10:14

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఇక సోనమ్‌ కపూర్‌ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రముఖ సెలబ్రెటీ మ్యాగజైన్‌ వోగ్‌కు ఫొటోషూట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బిడ్డను ఎలా పెంచాలనుకుంటుందో వివరించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన బిడ్డ భవిష్యత్తుపై ప్రస్తావించింది. ‘మా నాన్న ఓ హీరో. మాది సెలబ్రెటీ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ మమ్మల్ని చాలా సాధారణంగా పెంచారు.

చదవండి: ఖర్చు లేకుండా నయన్‌ దంపతుల హనీమూన్‌ ట్రిప్‌? ఎలా అంటే..

మా అమ్మనాన్నలు(అనిల్‌ కపూర్‌, సునీత్‌ కపూర్‌)  నన్ను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్థన్‌ను చాలా గోప్యంగా పెంచారు. సెలబ్రెటీల లైఫ్‌కు దూరంగా మీడియా దృష్టికి పడకుండ జాగ్రత్త పడ్డారు. వారు అలా ఎలా ఉంచగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక నా విద్యాభ్యాసం అయితే ఏ స్టార్‌ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్‌లో జరిగింది. ఆ తర్వాత జూనీయర్‌ కాలేజ్‌ కోసం బోర్డింగ్‌ స్కూల్‌కి వెళ్లాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకు అలాంటి జీవితమే ఇవ్వాలనుకుంటున్నా. వారిని సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నా.

చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

చెప్పాలంటే.. నా బిడ్డను ఇండియాలో చదివించాలా? లండన్‌లో చదివించాలా? అని ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నా. భారత్‌లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్న అనుభూతి ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటే నా బిడ్డ విషయంలో గోప్యత కష్టమవుతుంది. అదే సమయంలో చాలామంది స్టార్ కిడ్స్ ఇక్కడ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత కొన్ని అడ్డంకులను చాలా సులువుగా దాటగలమని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాను వివాహం చేసుకుంది సోనమ్‌. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చిన ఆమె ఆగస్ట్‌ 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)