Breaking News

అలాంటి డ్రెస్‌లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ చేసినట్టేనా!

Published on Wed, 10/15/2025 - 14:39

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీలో కీలక పాత్రలో కనిపిచంనుంది. ఇటీవలే సోనాక్షి ఫస్ట్‌ లుక్‌ రివీల్ చేసిన మేకర్స్.. స్పెషల్ సాంగ్‌ను సైతం విడుదల చేశారు. ధన పిశాచి పేరుతో విడుదలైన పాట ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ మూవీలో సోనాక్షి విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది. టీజర్‌లోనూ సోనాక్షి లుక్స్ అభిమానులను అలరించాయి.

అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబయిలో జరిగిన వెడ్డింగ్ వేడుకలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరు జంటగా ఓ ఈవెంట్‌లో కనిపించారు. ఇందులో సోనాక్షి వదులుగా ఉండే అనార్కలి సూట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో సోనాక్షి గర్భవతి అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆమె ఫేస్ చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోందని ఏకంగా కంగ్రాట్స్‌ కూడా చెబుతున్నారు. ఫోటోలకు పోజులిచ్చే సమయంలో సోనాక్షి తన చేతితో బేబీ బంప్‌ను దాచేందుకు ప్రయత్నించిందని మరికొందరు పోస్టులు పెట్టారు.

అయితే ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి, జహీర్ ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. ఈ ఏడాది జూలైలోనూ సోనాక్షి తాను ఎప్పుడూ గర్భవతి అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో వెల్లడించింది. జహీర్‌తో తన వాట్సాప్ చాట్  స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. అయితే జహీర్‌తో పెళ్లి తర్వాత సోనాక్షిని నెట్టింట తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)