Breaking News

లావుగా ఉన్నానని హీరోయిన్‌గా పక్కనపెట్టేశారు: సోనాక్షి

Published on Thu, 02/27/2025 - 13:10

తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం వర్కవుట్లు చేస్తూ ఉంటారు. ఏమాత్రం బొద్దుగా తయారైనా ఆఫర్లు అందుకోవడం గగనమే అవుతుంది. కొందరైతే బరువు తగ్గడానికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి షార్ట్‌కట్లు కూడా వెతుకుతారు. ఎందుకంటే వాళ్లకు నచ్చినట్లుగా ఉంటే ఆఫర్లు రావడం అంత ఈజీ కాదు. తన విషయంలోనూ ఓసారి ఇదే జరిగిందంటోంది హీరోయిన్‌ సోనాక్షి సిన్హ (Sonakshi Sinha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ఓసారి ఏమైందంటే నేను లావుగా ఉన్నానని రిజెక్ట్‌ చేశారు.

అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చా..
అప్పుడు నా మనసు ముక్కలైంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. కాస్త లావయ్యానని కథానాయిక పాత్రకు నన్ను తిరస్కరించారు. ఆ పాత్రలో నేను బాగోనని, కావాలంటే ఏదైనా చిన్నాచితకా పాత్రలు చేసుకోమని సలహా ఇచ్చారు. నాకు చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్లేసరికి మా అత్త అక్కడే ఉంది. దేవుడు నన్నెందుకిలా పుట్టించాడు? నాకెందుకిలా చేస్తున్నాడు? అంటూ నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చాను. బాధపోయేవరకు ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజే మళ్లీ మామూలు మనిషయ్యాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
సోనాక్షి చివరగా కకుడా (Kakuda Movie) అనే హారర్‌ చిత్రంలో కనిపించింది. అలాగే సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన హీరామండి: ద డైమండ్‌ బజార్‌ వెబ్‌ సిరీస్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం హీరామండి రెండో సీజన్‌లో యాక్ట్‌ చేస్తోంది. గతేడాది సోనాక్షి నటుడు జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది.

చదవండి: ఓటీటీలో 'షకీలా' బయోపిక్‌ స్ట్రీమింగ్‌.. అలాంటి కంటెంట్‌ కావడంతో..

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)