ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్‌!

Published on Wed, 06/26/2024 - 12:40

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. సోనాక్షి, జహీర్‌ వేర్వేరు వర్గానికి చెందినవారు కావడంతో నెటిజన్లు ఈ జంటను దుమ్మెత్తిపోస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి పెళ్లైన మరుక్షణం నుంచే విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తారా స్థాయిలో ఉండటంతో సోనాక్షి, ఇక్బాల్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కామెంట్‌ సెక్షన్‌ను సైతం ఆఫ్‌ చేశారు. 

కరెక్ట్‌గా చెప్పావ్‌
అయినప్పటికీ సోషల్‌ మీడియాలో కొత్త జంటపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రసాద్‌ భట్‌ అనే ఆర్టిస్టు సోనాక్షి- ఇక్బాల్‌ దంపతుల గ్రాఫిక్‌ పిక్‌ను డిజైన్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అన్నింటికంటే ప్రేమ అనే మతమే గొప్పది అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది చూసిన సోనాక్షి.. చాలా కరెక్ట్‌గా చెప్పావు అని రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్‌తో ఆమె ట్రోలర్స్‌కు పరోక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చినట్లయింది.

నా కూతురు ఏ తప్పూ చేయలేదు
మరోవైపు తన కూతురిని ట్రోల్‌ చేస్తున్నవారిపై సోనాక్షి తండ్రి, నటుడు శతృఘ్న సిగ్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఉద్యోగం సద్యోగం ఏదీ లేకుండా ఉన్నవాళ్లందరూ ఇలా అవతలివారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నా కూతురు ఏ తప్పూ చేయలేదు. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల ఇష్టం. అందులో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు. విమర్శించేవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ముందు వెళ్లి మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఏదైనా పనికొచ్చే పని చేయండి' అని మండిపడ్డాడు.

 

చదవండి: హీరోయిన్‌ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)