Breaking News

మాజీ ప్రియురాలి ఇంట్లో గేమ్స్‌.. నా పక్కన ఆమె తల్లి..!

Published on Fri, 04/12/2024 - 16:11

ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా? అంటే చాలామంది అబ్బేం, అదేం లేదని సులువుగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అదే ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే.. ఎస్‌, గతంలో పలువురితో ప్రేమలో పడ్డానంటూ చాంతాడంత లిస్టు బయటపెడతారు. కొందరు మాత్రం ఒకరిద్దరితోనే ఆగిపోతారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బ్రదర్స్‌ కూడా డేటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసినవారే! సల్లూభాయ్‌ సోదరుడు, నటుడు సోహైల్‌ ఖాన్‌ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాజీ ప్రేయసి ఇంట్లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను షేర్‌ చేసుకున్నాడు.

దాగుడుమూతలు
'నా ప్రియురాలి(ప్రస్తుతం మాజీ గర్ల్‌ఫ్రెండ్‌) ఇంట్లో మేమంతా దాగుడుమూతలు ఆడాము. నేను వెళ్లి వార్డ్‌రోబ్‌లో దాక్కున్నాను. అప్పుడే మరొకరు అదే వార్డ్‌ రోబ్‌లో దూరారు. నా గర్ల్‌ఫ్రెండ్‌ వచ్చిందేమో అనుకున్నాను. అంతా చీకటిగా ఉండటంతో అసలేమీ కనిపించలేదు. నా పక్కన ఉంది ప్రేయసే అనుకుని ఏదేదో ఊహించుకున్నాను. కట్‌ చేస్తే లైట్లు ఆన్‌ చేశారు. అందరూ బయటకు వచ్చారు. గేమ్‌ అయిపోయింది.. ఇంకా ఎందుకు దాక్కున్నారు? అని అడిగారు. అప్పుడు కానీ నాతో ఉన్నది ప్రియురాలి తల్లి అని అర్థం కాలేదు' అంటూ నవ్వేశాడు.

అన్నింటికీ ఎక్స్‌పైరీ
సీమా కిరణ్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'ప్రతిదానికి ఎక్స్‌పైరీ ఉంటుంది. చాక్లెట్‌, మెడిసిన్‌, ఫుడ్‌.. ఇలా అన్నీ ఏదో ఒకరోజు పాడైపోయేవే. సంతోషంగా ఉన్నన్నాళ్లూ వైవాహిక బంధం బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇద్దరి మధ్య నెగెటివ్‌ ఎనర్జీ వచ్చిందా? అది అంత ఈజీగా పోదు. గొడవలు పడుతూ ఉండే కంటే విడిపోవడమే మంచిది అని చెప్పుకొచ్చాడు. 1998లో సీమాను పెళ్లాడిన ఇతడు 2022లో విడాకులు తీసుకున్నాడు.

చదవండి: హీరోయిన్‌ను పెళ్లాడిన దర్శన్‌? ఫోటో వైరల్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)