ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు

Published on Wed, 08/05/2026 - 14:54

ఇండస్ట్రీలో ఉన్న టైంలో కొందరు నటీనటులు రాజకీయాలు గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడితే మళ్లీ తమ సినిమాలకు ఏమైనా ఇ‍బ్బందులు వస్తాయేమో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మొహమాటం లేకుండనే మాట్లాడేస్తుంటారు. అలా అక్కినేని కోడలు శోభిత.. కమ్యూనిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

(ఇదీ చదవండి: విజయ్ కాదు మహేశ్ బాబు ఆ సినిమా చేయాలి)

'నాకు రాజకీయాలపై బలమైన అభిప్రాయం ఉంది. నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని సదరు వీడియోలో శోభిత చెబుతున్నట్లు ఉంది. అయితే ఇది ఎనిమిదేళ్ల ‍క్రితం నాటి వీడియో. 'గూఢచారి' మూవీ ప్రమోషన్ల టైంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో శోభిత ఇలా చెప్పింది.

శోభిత ఏ ఉద్దేశంతో అన్నాదో ఏమో గానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సదరు వీడియో వైరల్ అవుతుంది. ధైర్యంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పిందని కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ఈమెని విమర్శిస్తున్నారు. నటిగా కొనసాగుతూ లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవిస్తూ శోభిత, కమ్యూనిజం గురించి మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అప్పుడెప్పుడో చేసిన కామెంట్స్ కారణంగా శోభిత మళ్లీ ట్రెండ్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)