Breaking News

పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత

Published on Mon, 12/09/2024 - 10:10

శోభిత... అక్కినేని ఇంటి కోడలైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని ఇటీవలే పెళ్లి చేసుకుంది. తర్వాత భర్త, మామతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడిని కూడా దర్శించుకుంది. గత కొన్నిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న శోభిత.. కాస్త తీరిక దొరకడంతో భర్త, పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)

'చైతన్య.. నా జీవితంలోకి రావడం అదృష్టం. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా నాకు ఎంతో నచ్చేశాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేను నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. వంట విషయంలోనూ ప్రాక్టీస్ ఉంది. ఆవకాయ, ముద్దపప్పు చేయడమంటే చాలా ఇంట్రెస్ట్' అని శోభిత చెప్పుకొచ్చింది.

నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్'.. రాబోయే ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ నెల నుంచి 'విరూపాక్ష' దర్శకుడు తీసే కొత్త సినిమాలోనూ చైతూ నటించబోతున్నాడు. శోభిత విషయానికొస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవి లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పెళ్లి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తుందేమో!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)