Breaking News

చీర కడితే ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sun, 09/21/2025 - 17:33

హీరో ఫ్రెండ్స్‌ క్యారెక్టర్స్‌ చేసి బాగా పాపులర్‌ అయిన నటి స్నిగ్ధ. ‘అలా మొదలైంది’ చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించి.. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, చందమామ కథలు, టైగర్‌, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. సినిమాల్లోనే కాకుండా బటయ కూడా అబ్బాయి గెటప్‌లోనే ఉంటారు టాలెటెండ్‌ నటి. 

అబ్బాయిల మాదిరే ప్యాంట్‌, షర్ట్‌ ధరించి..హెయిర్‌ స్టైల్‌ కూడా అలానే మెంటేన్‌ చేస్తుంటారు. ఆమె లుక్‌, మాటతీరే.. సినిమా చాన్స్‌లు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. మొన్నటివరకు మంచి డిమాండ్‌ ఉండేది. నటనకు విరామం వచ్చినా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదని చెబుతోంది ఈ నటి. సినిమాల్లో నటించకపోయినా..స్టేజ్‌ షోల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నానని చెబుతోంది.

ఇక తన లుక్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇలా (ప్యాంట్‌, షర్ట్‌ ధరించి మగరాయుడిలా) ఉండడం వల్లే.. మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ఒకవేల ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారు. నేను 5 నిమిషాల్లో చీరకట్టుకోగలను కానీ..కంఫర్టబుల్‌గా ఉండలేను. ఫ్యాన్స్‌ కోసమే చీర కట్టడంలేదు’అని నవ్వుతూ చెప్పారు. ఇక పెళ్లి గురించి అడగ్గా.. ‘కచ్చితంగా చేసుకుంటాను.కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్‌ పర్సన్‌ దొరకాలి. నాకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.

ఇక తన ఆదాయ మార్గాలను వివరిస్తూ.. ‘నాకు యాక్టింగ్‌తో పాటు మ్యజిక్‌ కూడా వచ్చు. సంగీత దర్శకురాలిగా పని చేశాను .ఎగ్జిక్యూటివ​ ప్రొడ్యూసర్‌గానే వర్క్‌ చేశా. ఇలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని హాయిగా గడుపుత్నున్నా. సినిమా చాన్స్‌ల కోసం నేను ఎవరిని అడగను. వచ్చిన అవకాశాలనే తీసుకుంటాను. నా నోటిదూల కారణంగానే సినిమా చాన్స్‌ ఇస్తున్నారు. ఇప్పుడు షోలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే ఇంతవరకు ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు. ఒక సిస్టర్‌లా, బ్రదర్‌లా నన్ను చూసుకున్నారు’ అని స్నిగ్ద చెప్పుకొచ్చింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)