Breaking News

సిగ్గనిపించట్లేదా? అని మేకప్‌ మెన్‌ ముఖం మీదే..: స్మృతి ఇరానీ

Published on Sun, 03/26/2023 - 17:48

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మొదట్లో బుల్లితెరపై నటిగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే! రామాయణ్‌, విరుధ్‌: హర్‌ రిష్తా ఏక్‌ కురుక్షేత్ర, హమ్‌ హై కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌, క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో మేకప్‌మెన్‌ తనను అవమానించాడట.

దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌ మొదటి ఏడాది నాకు రోజుకు రూ.1800 ఇచ్చారు. అప్పటికింకా నాకు సొంతంగా కారు కూడా లేదు. జుబిన్‌ను పెళ్లాడాక మాకిద్దరికీ కలిపి రూ.30,000 దాకా వచ్చేవి. అయినా సరే నేను ఆటోలోనే సెట్స్‌కు వెళ్లేదాన్ని. ఓ రోజు నా మేకప్‌ మెన్‌.. నేను రోజూ కారులో వస్తున్నా, మీరిలా ఆటోలో వస్తున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? అని ముఖం మీదే అడిగాడు. సొంతంగా ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని చెప్పాడు. అప్పుడు నాకెంతో అవమానంగా అనిపించింది.

మరోవైపు సీరియల్‌ సెట్‌లో ఎటువండి కూల్‌డ్రింక్స్‌, ఫుడ్‌ తీసుకోవడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్‌ రూల్స్‌ ఉండేవి. ఎందుకంటే ఆ ఫుడ్‌ అక్కడున్న వస్తువులపై పడితే శుభ్రం చేయడం కష్టం అవుతుందని యూనిట్‌ బాధ! అందుకే ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే సెట్‌ నుంచి బయటకు వచ్చి ఛాయ్‌ ఆస్వాదించేదాన్ని' అని చెప్పుకొచ్చారు. ఇకపోతే క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌లో ఆమె తులసి విరాణిగా నటించారు. కాగా స్మృతి ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో అమేథీ గడ్డపై రాహుల్‌ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)