Breaking News

'స్కై ఫోర్స్'‌ టీమ్‌తో సర్జికల్ స్ట్రైక్ చేయనున్న బాలీవుడ్‌ స్టార్స్‌

Published on Sun, 10/20/2024 - 15:28

బాలీవుడ్‌లో వరుస విజయాలతో ప్రముఖ నిర్మాత దినేష్‌ విజన్‌ దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలో విడుదలైన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా, ముంజ్యా, స్త్రీ 2 చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదే ఊపుతో ఆయన తదుపరి బిగ్‌ ప్రాజెక్ట్‌లపైన కసరత్తు ప్రారంభించారు. దినేష్‌ విజన్‌ నిర్మాణ భాగస్వామ్యంతో 'స్కై ఫోర్స్, ఛావా' వంటి భారీ చిత్రాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'ఛావా' సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్‌లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ భారీ అంచనాలను పెంచేసింది. మరోవైపు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, వీర్, నిమ్రత్ కౌర్  నటించిన 'స్కై ఫోర్స్' 2025లో విడుదల కానుంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారు. యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో పాటు థ్రిల్స్, బలమైన దేశభక్తి థీమ్‌తో నిండి ఉందని చిత్ర నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ టీమ్‌ పేర్కొంది. పాకిస్థాన్‌పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ మూవీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుందని వారు పేర్కొన్నారు.

'స్కై ఫోర్స్' సినిమాలో VFX వర్క్‌ బాగా వర్కౌట్‌ అయింది.  జాతీయ, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న  DNEG సంస్ధ వారు ఈ సినిమా VFX కోసం పనిచేశారు. ఈ చిత్రంలో ఉత్కంఠభరితమైన వైమానిక దృశ్యాలు అందరినీ మెప్పిస్తాయి. అక్షయ్ కుమార్, వీర్ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ స్టాండ్ అవుట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌ క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్‌లో ఎన్నటికి నిలిచిపోయేలా స్కై ఫోర్స్ చిత్రం ఉంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)