Breaking News

ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత

Published on Wed, 04/02/2025 - 13:33

ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్‌ సినిమా. ది టైం మెషీన్‌ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 4న రీరిలీజ్‌ అవుతోంది.

విజయశాంతిని అనుకున్నాం..
ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్‌ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్‌ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్‌ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌

పెళ్లయ్యాక సినిమాలకు గుడ్‌బై
సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్‌ టెస్ట్‌ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్‌ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.

చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)