Breaking News

మెడికల్‌ స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న తెలుగు హీరో!

Published on Sat, 10/18/2025 - 16:41

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా శివ కుమార్ రామచంద్రవరపు మెప్పించాడు. ప్రస్తుతం ఆయన ఒక మెడికల్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు ఒక వార్త వైరల్‌ అవుతుంది. తన కెరీర్‌ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా విలన్‌గా కూడా పలు సినిమాల్లో నటించాడు. గతేడాదిలోనే ఆయన హీరోగా నటించిన చిత్రం  నరుడి బ్రతుకు నటన విడుదలైన విషయం తెలిసిందే. నిన్నుకోరి, వకీల్‌ సాబ్‌, తొలిప్రేమ, మజిలీ వంటి చిత్రాలతో శివ కుమార్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. మల్టీ టాలెంట్‌ ఉన్న శివ కుమార్‌ ఇలా మెడికల్‌ షాప్‌లో పనిచేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే, శివ కుమార్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. సినిమా ఛాన్సులు  లేకపోవడంతో తెలంగాణలోని సూర్యాపేటలో ఒక మెడికల్‌ షాపులో ఆయన పనిచేస్తున్నట్లు ఒక వీడియో ఫుటేజ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.  షాప్‌లోకి వచ్చిన కస్టమర్స్‌కు మెడిసిన్స్‌ ఇస్తూ శివ కుమార్‌ కనిపించారు. దీంతో నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం, డ్రగ్స్‌  అమ్మడం వంటి పనులు చేయడం లేదు కదా అంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఆ షాప్‌ తనదే ఉండొచ్చిన కూడా అంటున్నారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన శివ కుమార్‌ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం అంటూ జరగదని కొందరు నెటిజన్లు తెలుపుతున్నారు. అదంతా ఏదైనా సినిమా, వెబ్‌ సీరిస్‌ కోసం ఉండొచ్చని పేర్కొంటున్నారు. మెడికల్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసే అవసరం ఆయనకు లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే, అసలు విషయం తెలియాల్సి ఉంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)