Breaking News

ఈ మూవీ కోసం ఒక్క పైసా తీసుకోని హీరో!

Published on Thu, 12/28/2023 - 14:30

హీరో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం అయలాన్‌. రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆర్‌.రవికుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై కొటపాటి జయం రాజేశ్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని, నీరవ్‌షా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్‌ సందర్భంగా జనవరి12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రామాన్ని చైన్నెలో నిర్వహించారు.

ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది
ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో బాహుబలి, కన్నడంలో కేజీఎఫ్‌ చిత్రాల మాదిరి తమిళంలో అయలాన్‌ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో రక్తంతో కూడిన హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవన్నారు. ఆబాలగోపాలం చూసి ఆనందించే విధంగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా అయలాన్‌ ఉంటుందన్నారు. అదే విధంగా ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ చిత్రం కోసం తాను ఒక పాటను కూడా రాసినట్లు చెప్పారు.తనకు చిన్న తనం నుంచి కార్టూన్‌, గ్రాఫిక్స్‌ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు.

ఇతర సినిమాలతో పోల్చనుగానీ..
ఆ తరహాలో ఒక చిత్రాన్ని మనం చేయగలమా? అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తేదన్నారు. దానికి సమాధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రం చేస్తే ఆ తరువాత మరిన్ని ఇలాంటి చిత్రాలు వస్తాయని భావించామన్నారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతకు పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించడానికి తాను పారితోషికం కూడా వద్దు.. చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయమని చెప్పానన్నారు. ఇతర చిత్రాలతో పోల్చను కానీ, అయలాన్‌ తమిళ చిత్రపరిశ్రమలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు, టీజర్‌ కంటే ట్రైలర్‌ ఇంకా అదిరిపోతుందని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు.

చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)