Breaking News

మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?

Published on Sat, 04/12/2025 - 11:20

శివకార్తికేయన్‌( Sivakarthikeyan).. ఈ పేరు ఇప్పుడు విజయాలకు కేరాఫ్‌గా మారిందనే చెప్పాలి. అయిలాన్, మావీరన్, అమరన్‌ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి మదరాసి. తమిళంలో కొంత గ్యాప్‌ తరువాత దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌( A.R. Murugadoss) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రుక్మిణి వసంత్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో విద్యుత్‌ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజూ మీనన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే 80 శాతం పూర్తి అయినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్ర షూటింగ్‌ మధ్యలో దర్శకుడు మురుగదాస్‌ హిందీలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా సికిందర్‌ చిత్రాన్ని  చేసే అవకాశం రావడంతో మదరాసి చిత్ర షూటింగ్‌లో జాప్యం జరిగిందనే ప్రచారం జరిగింది. కాగా సికిందర్‌ చిత్రం ఇటీవల తెరపైకి రావడంతో దర్శకుడు మురుగదాస్‌ మదరాసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సెపె్టంబర్‌ 5న విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. శివకార్తికేయన్‌ ఇంతకుముందు నటించిన సూపర్‌హిట్‌ చిత్రం అమరన్‌ తరువాత మదరాసి చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)