Breaking News

శివకార్తికేయన్‌ వల్లే ఇది సాధ్యమైంది!

Published on Thu, 05/02/2024 - 13:27

మదుబాణకడై, వట్టం చిత్రాల ఫేమ్‌ కమల్‌ కన్నన్‌ తెరకెక్కించిన తాజా చిత్రం కొరంగు పెడల్‌. కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సంతోష్‌ వేల్‌మురుగన్, వీఆర్‌.రాఘవన్, ఎం.జ్ఞానశేఖర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు రాశీ అళగప్పన్‌ రాసిన సైకిల్‌ అనే చిరు కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌జీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సంజయ్, సవిత కలిసి నిర్మించారు. జిబ్రాన్‌ సంగీతం, సునీల్‌ భాస్కర్‌ ఛాయాగ్రహణం అందించారు.

జీవితంలోని సంఘటనలు..
హీరో శివకార్తికేయన్‌కు చెందిన ఎస్‌కే.ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కురంగు పెడల్‌ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాళీవెంకట్‌ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదన్నారు. తన జీవితంలోని పలు సంఘటనలను ఈ చిత్రం గుర్తు చేసిందన్నారు. కురంగు పెడల్‌ చిత్రంలోని కురంగు అనే పాట గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం విశేషం అన్నారు.

కనెక్ట్‌ అయిపోయా
చిత్ర నిర్మాత సవితా మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వినగానే తాను దీనికి కనెక్ట్‌ అయిపోయానన్నారు. సైకిల్‌ అనేది మన ఎదుగుదలలో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు చాలా స్వతంత్రాన్ని ఇచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు కమల్‌కన్నన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి చేరడానికి ముఖ్య కారణం  శివకార్తికేయన్‌. ఇందులో పని చేసిన వారంతా తమ సొంత చిత్రంగా భావించారని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)