Breaking News

శివకార్తికేయన్‌తో ఇద్దరు ట్రెండింగ్‌ హీరోయిన్స్‌..

Published on Mon, 06/09/2025 - 09:43

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌(Sivakarthikeyan).. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్‌ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్‌ ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్‌ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. 

శివకార్తికేయన్‌ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది టైమ్‌ ట్రావెలింగ్‌ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కాయాదు లోహర్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్‌ అని సమాచారం. 

కాగా కల్యాణి ప్రియదర్శన్‌(Kalyani Priyadarshan) ఇంతకుముందే శివకార్తికేయన్‌కు జంటగా హీరో (శక్తి) చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆమె తెలుగులో 'చిత్రలహరి, హలో' వంటి సినిమాలతో మెప్పించారు. మరోవైపు కాయాదు లోహర్(Kayadu Lohar) పేరు డ్రాగన్‌ సినిమాతో తెలుగు, తమిళ్‌లో   బాగా పాపులర్‌ అయిపోయిన విషయం తెలిసిందే. కాగా శివకార్తికేయన్‌ వెంకట్‌ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)