Breaking News

గుడ్‌నైట్‌ దర్శకుడికి శివకార్తికేయన్‌ ఛాన్స్‌.. తండ్రి పాత్రలో స్టార్‌ హీరో

Published on Thu, 06/19/2025 - 07:08

కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)కు ఇప్పుడు మంచి కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న శివకార్తికేయన్‌ కూడా చాలా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు నటించిన అమరన్‌ చిత్రం ఘనం విజయం సాధించింది. ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న మదరాసి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. రవిమోహన్‌, అధర్వ, ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. 

ఈచిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇది శివకార్తికేయన్‌ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈయన తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. దీనికి గుడ్‌నైట్‌ చిత్రం ఫేమ్‌ వినాయక్‌ చంద్రశేఖరన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలలైనట్లు సమాచారం. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని, శివకార్తికేయన్‌కు తండ్రిగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ( Mohanlal)ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్‌ ఆగస్ట్‌ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)