Breaking News

సైనికా నీ స్ఫూర్తికి సెల్యూట్‌

Published on Sun, 12/15/2024 - 03:45

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘అమరన్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

సినిమా అన్నది మనకి చాలావరకు వినోద సాధనం మాత్రమే. కొన్ని సినిమాలు వినోదంతోపాటు విషయ విశ్లేషణను అందిస్తే మరికొన్ని మాత్రం మనకు స్ఫూర్తిదాయకమవుతాయి. అటువంటి ప్రత్యేకమైన సినిమానే ‘అమరన్‌’. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు  దేశభక్తి, లేక సైనికులకు సంబంధించిన సినిమాలు చూసి నిజంగా మనం ఇప్పటిదాకా ఏమైనా స్ఫూర్తి పొందామా అన్న విషయం ఆలోచించుకోవాలి. ప్రతిరోజూ మనకి కరెంట్‌ పోతేనో లేక టైమ్‌కి ఫుడ్‌ అందకపోతేనో లేదంటే సినిమాకి టికెట్లు దొరక్కపోతేనో ఎంతో చిరాకు పడిపోతాం.

కానీ కనురెప్ప మూసినా, రోజుల తరబడి ఆహారం అందకపోయినా అనుక్షణం ప్రమాదం పొంచి ఉన్నా విపరీత వాతావరణ పరిస్థితుల్లో కూడా తమ వారందరికీ దూరంగా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న మన సైనికుల కష్టం నేడు ఎంత మందికి తెలుసు. ఓ సైనికుడు తన ము΄్పాతిక భాగం జీవితాన్ని డ్యూటీలోనే గడిపేస్తాడట. అలాగే తన కుటుంబాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేసేవాడు సైనికుడు. అటువంటి సైనికుడి కథే ఈ ‘అమరన్‌’. ఇదో వాస్తవ గాథ. తమిళనాడుకు చెందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ 2014 సంవత్సరం ఏప్రిల్‌ 25న వీరమరణం పొందారు. అప్పటినుండి దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది.

అసలెవరీ ముకుంద్, అతను సైనికుడు ఎలా, ఎందుకు అయ్యాడు? అన్నదే ఈ ‘అమరన్‌’  సినిమా. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందిన ఇతడు 2006 లెఫ్టినెంట్‌ స్థాయిలో ఉన్న ముకుంద్‌ ఆరేళ్ల లోపే మేజర్‌ స్థాయికి ఎదిగాడంటే అతని సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజ్‌ కుమార్‌ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్‌ మేజర్‌ ముకుంద్‌పాత్రకు ప్రాణం పోశారు. ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించారు. ఆమె కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా మనల్ని కాసేపు మేజర్‌ జీవితంతో ప్రయాణ అనుభూతినిస్తుంది. 

ఈ సినిమాలో ముకుంద్‌ ధైర్యసాహసాలు, తెగువకు మించి అతని సైనిక స్ఫూర్తిని ఎంతో సవివరంగా చూపించారు దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా ‘అమరన్‌’ తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రతిక్షణం మన కోసం తన వాళ్లని వదులుకుని ప్రాణత్యాగానికైనా వెనుకాడని మన అమర వీరుల దినోత్సవం అయిన ఈ జనవరి 30న కనీసం ఓ సెల్యూట్‌ అయినా చేద్దాం, అలాగే అందరితో చేయిద్దాం. ఎందుకంటే అంతటి అసమాన వీరులకు మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత ఇదే. – ఇంటూరి హరికృష్ణ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)