Breaking News

ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు టీవీకి ముద్దుపెట్టేవారు: కనిమొళి

Published on Mon, 06/05/2023 - 14:50

దివంగత మహానటుడు శివాజీ గణేషన్‌ తొలి అభిమాని కలైంజ్ఞర్‌ కరుణానిధి అని డీఎంకే పార్టీ ఉప కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేర్కొన్నారు. కరుణానిధి శత జయంతి సందర్భంగా డీఎంకే పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ గణేషన్‌ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్‌ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కరుణానిధి సంభాషణలు అందించడం గమనార్హం.

కాగా ఈ చిత్ర ప్రదర్శనకు కనిమొళి, దయానిధి మారన్‌, పూచి మురుగన్‌ మొదలగు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ శివాజీ గణేషన్‌కు తొలి అభిమాని కలైంజ్ఞర్‌ అని చెప్పవచ్చును. శివాజీ గణేషన్‌ ఎలా నటిస్తున్నారో చూడు అంటూ ఇంటిలో టీవీ చూస్తూ వెళ్లి అమాంతం టీవీకి ముద్దుపెట్టే వారని చెప్పారు.

అలాంటప్పుడు తన తల్లి కూడా పరిహాసం ఆడేవారని అయినా శివాజీ గణేషన్‌ నటన చూసి కరుణానిధి నిగ్రహించుకునేవారు కాదన్నారు. కథానాయకులకు బహు తెలివిని, మార్గదర్శకాన్ని చూపిన చిత్రం పరాశక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వారిగానే కథానాయికలు ఉన్నారని, అయితే అప్పటి హీరోయిన్‌ పాత్రలు ఆలోచింపచేసేవిగానూ, సామాజిక సందేశాన్ని ఇచ్చేవి గానూ ఉండేవని అభిప్రాయపడ్డారు.

చదవండి: మహాభారత్‌ నటుడు కన్నుమూత

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు