Breaking News

శివ కార్తికేయన్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా?

Published on Mon, 01/23/2023 - 09:11

తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్‌ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్‌తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించి స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగొందారు. విజయ్‌ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్‌ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్‌ చివరిగా రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్బార్‌ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్‌ ఫేట్‌ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్‌ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది.

అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్‌ తర్వాత మురుగదాస్‌ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాల తాజా సమాచారం. ఏఆర్‌ మురుగదాస్‌ నటుడు శివ కార్తికేయన్‌ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని  లైట్‌ హౌస్‌ మూవీస్‌ సంస్థ నిర్మించినట్లు టాక్‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది.  కాగా ప్రస్తుతం అయిలాన్‌ చిత్రాన్ని పూరి చేసి మావీరన్‌  చిత్రంలో నటిస్తున్నారు.   

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)