Breaking News

రూ.3 కోట్ల ఆఫర్‌.. అక్కర్లేదని రిజెక్ట్‌ చేశాం: శివబాలాజీ దంపతులు

Published on Mon, 03/31/2025 - 14:33

బెట్టింగ్‌ యాప్స్‌ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్‌ యాప్స్‌ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్‌ వరకు చాలామంది ప్రమోట్‌ చేస్తున్నారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని అడిగారు
ఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్‌ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్‌ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

రూ.3 కోట్ల ఆఫర్‌
ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని రూ.3 కోట్ల ఆఫర్‌ ఇచ్చారు. ట్రేడింగ్‌, బెట్టింగ్‌.. ఇలా చాలావాటిని ప్రమోట్‌ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్‌ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్‌ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.

చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్‌ రష్మీ గౌతమ్‌.. చివర్లో: నితిన్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)