Breaking News

సితారకు వార్‌ 2

Published on Sun, 07/06/2025 - 04:18

హీరో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్‌ 2’. హృతిక్‌ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘వార్‌ 2’. ఇండియన్‌ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్‌ స్టార్స్‌ అయిన హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్‌ ఫీస్ట్‌లా ఉంటుంది.

ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌  సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్‌ 3, వార్‌’ వంటి గ్లోబల్‌ హిట్‌ మూవీస్‌ తర్వాత వస్తోన్న ‘వార్‌ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్‌ 14న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ కానుంది’’ అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేర్కొంది.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)