Breaking News

తొలి పారితోషికంపై సితార కామెంట్స్‌.. నెట్టింట ప్రశంసల జల్లు

Published on Sat, 07/15/2023 - 15:01

మహేశ్‌బాబు- నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార అప్పుడే తండ్రి గర్వించే స్థాయికి ఎదిగింది. సితార తొలిసారిగా న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డ్‌పై మెరిసిన సంగతి తెలిసిందే కదా! పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఇకపోతే చిన్న వయసులోనే యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టి అదుర్స్‌ అనిపించిన సితార మంచి డ్యాన్సర్‌ కూడా! అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్యాన్స్‌ వీడియోలను అప్పుడప్పుడు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఫ్రోజెన్‌ 2 సినిమా తెలుగు వర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు కూడా తనే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ నిలిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించింది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: స్టార్‌ హీరోయిన్‌.. అయినా చెప్పులు మోసింది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)