Breaking News

'సితారే జమీన్‌ పర్‌' ట్విటర్‌ రివ్యూ.. ఆమిర్‌ ఖాన్ మార్క్‌

Published on Fri, 06/20/2025 - 09:48

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్ (Aamir Khan), జెనీలియా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సితారే జమీన్‌ పర్‌' (Sitaare Zameen Par). జూన్‌ 20న హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి ఆట పూర్తి అయింది. దీంతో సినిమా గురించి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆర్‌.ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని విడుదల చేసింది. ‘తారే జమీన్‌ పర్‌’కు సీక్వెల్‌గా దీనిని రూపొందించారు. ఈ సినిమాపై సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నాయనేది తెలుసుకుందాం.

మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ ఇచ్చి.. వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ఇతివృత్తంగా ఈ 'సితారే జమీన్‌ పర్‌' సినిమా కథ ఉంటుంది. ఆమిర్‌ఖాన్‌ ఇందులో కోచ్‌గా మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆమిర్‌ ఖాన్‌ నటించిన అత్యుత్తమమైన చిత్రాలలో  ఈ మూవీ తప్పకుండా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శకత్వంతో పాటు సూపర్ స్క్రీన్ ప్లే అంటూ అభినందిస్తున్నారు. ప్రతి సీన్‌లో అదిరిపోయే సందేశాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆపై వెంటనే ఏడిపిస్తుంది కూడా అంటూ ఒకరు పేర్కొన్నారు. ఈ సినిమాను అంకెలతో కొలమానంగా చూపుతూ.. స్టార్‌ రేటింగ్‌లు ఇచ్చి ఇందులో నటించిన ఆ పిల్ల టాలెంట్‌ను తక్కువ చేయలేమన్నారు.

మొదటి భాగంలో పూర్తిగా వినోదాత్మక స్క్రీన్‌ప్లేతో కథ సాగుతుంది. ఇందులో ఆమిర్, జెనీలియా కెమిస్ట్రీ రిఫ్రెషింగ్‌గా ఉందని అంటున్నారు.  ఇందులో నటించిన బాల నటులందరూ అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తారని షేర్‌ చేస్తున్నారు. ఇంటర్వెల్‌ తర్వాత కథలో ఎమోషనల్‌ జర్నీ మొదలౌతుంది అంటున్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ అదిరిపోతుందట. దాని గురించి ఎంతచెప్పినా కూడా తక్కువే అని పోస్టులు పెడుతున్నారు. ఫైనల్‌గా ఈ మూవీ చూసిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోవడమే కాకుండా గూస్‌బంప్స్‌ తెప్పించే అనుభూతి కూడా పొందుతారు. కథతో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతారని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, కథ ప్రారంభంలో కాస్త ఇబ్బంది ఉంటుందని కొందరు తెలుపుతున్నారు. చాలా స్లోగా దర్శకుడు కథలోకి వెళ్లడం వల్లే ఈ ఇబ్బందని అంటున్నారు.

ఒక యూజర్‌  ఈ చిత్రానికి 10కి 6.5 రేటింగ్ ఇచ్చి, 'ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చూసిన తర్వాత, ఇది అతని పాత సినిమాల జ్ఞాపకాలను గుర్తు చేస్తంది. అతని లుక్ మీకు 'రంగ్ దే బసంతి. 3 ఇడియట్స్ చిత్రాలను చూసిన ఫీల్‌ కలుగుతుంది. అదే సమయంలో, కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఉంది.' అని చెప్పారు. అయితే, సితారే జమీన్‌ పర్‌లో నటించిన వారు అద్భుతంగా చేశారని ఎక్కువ మంది నెటిజన్లు అభినందిస్తున్నారు. కుటుంబంతో తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ సలహా ఇస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)