Breaking News

ప్రేమను కాపాడిన పోలీసోడి కథ

Published on Sun, 02/01/2026 - 16:23

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్‌లలో  చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం సిరై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

సినిమా కథలనేవి సమాజం నుండి పుట్టినవే. మన చుట్టూ జరిగిన ఘటనలను కాల్పనిక సన్నివేశాలతో జనరంజకంగా రూపొందిస్తారు దర్శకులు. అందుకే అడపాదడపా కొన్ని సినిమాలకు  వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అని ముందే చెబుతారు. నిజానికి వాస్తవ ఘటనలతో సినిమా తీయడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఎందుకంటే తీసే సినిమా ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయకుండా, అలాగే వాస్తవంగా జరిగిన ఘటనను అంతే స్పష్టంగా చెబుతూ ప్రేక్షకులను కట్టిపడేయడమంటే కష్టమే. అదే కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘సిరై’(Sirai). 

తమిళ రచయిత తమీజ్‌ అందించిన కథతో దర్శకుడు సురేశ్‌ రాజకుమారి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సిరై’. విక్రమ్‌ ప్రభు కథానాయకుడిగా ఈ సినిమాలో అలరించారు. సున్నిత మనస్కులు ఈ సినిమాని చూస్తే మాత్రం కంట నీరు పెట్టక మానరు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కానిస్టేబుల్‌ కదిరవన్‌ ఓ అండర్‌ ట్రైల్‌ ఖైదీని జైలు నుండి కోర్టుకు విచారణకై తీసుకెళ్లడమే ఈ సినిమా కథాంశం. అబ్దుల్‌ అనే ఖైదీ చుట్టూ సాగుతుందీ కథ. అబ్దుల్‌ ఓ హత్య కేసులో అండర్‌ ట్రైల్‌ ఖైదీగా ఉంటాడు. 

కోర్టులో తన కేసు విచారణకు రావడంతో కదిరవన్‌తో కలిసి కోర్టుకు బయలుదేరతాడు అబ్దుల్‌. మార్గ మధ్యంలో అబ్దుల్‌ తన కథను కానిస్టేబుల్‌ కదిరవన్‌కు చెబుతాడు. అబ్దుల్‌ అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్న కానిస్టేబుల్‌ కదిరవన్‌ కోర్టు ప్రాంగణంలోనే సాయపడాలని నిర్ణయించుకుంటాడు. అయితే కోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కానిస్టేబుల్‌ కదిరవన్‌కు అబ్దుల్‌ వినిపించిన కథేంటి? ఈ కథలో తనకు న్యాయం జరిగిందా? కోర్టులో జరిగిన ఘటనలు ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే జీ5 (Zee5) వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతున్న ‘సిరై’ చూడాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి. మరి... ప్రేమను కాపాడిన ఈ పోలీస్‌  కథను మీరూ చూసేయండి.  
– హరికృష్ణ ఇంటూరు  

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)