Breaking News

‘#సింగిల్‌’ మూవీ రివ్యూ

Published on Fri, 05/09/2025 - 12:49

శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్‌, శ్వాగ్‌ చిత్రాలతో రెండు సూపర్‌ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్‌’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).

కథేంటంటే..?
ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. విజయ్‌ ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్‌లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి స్నేహితుడు అరవింద్‌(వెన్నెల కిశోర్‌)తో కలిసి రకరకాల ప్లాన్‌ వేస్తాడు. 
ఇదే సమయంలో విజయ్‌ లైఫ్‌లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్‌ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్‌ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్‌ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్‌ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్‌ సింగిల్‌గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).

ఎలా ఉందంటే.. 
హీరో ఒక హీరోయిన్‌ని ప్రేమించడం, మరో హీరోయిన్‌ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్‌ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటే నా కల్ట్‌ ప్యాన్స్‌ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్‌ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్‌. మిగతాదంతా రొటీన్‌, రెగ్యులర్‌ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ , రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాను కాపాడాయి. 

తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్‌ డైలాగులకు, వెన్నెల కిశోర్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్‌ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్‌ చేసే పనులన్నీ రొటీన్‌గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్‌, వన్‌లైన్‌ పంచ్‌లు బాగా పెలడంతో బోర్‌ కొట్టదు.  కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్‌ కథనం ఫాస్ట్‌గానే సాగుతుంది.  

ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్‌) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు దర్శకుడు. ఓ యంగ్‌ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది.  ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.  

ఎవరెలా చేశారంటే.. 
శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్‌ అయినా ఉండాలి లేదంటే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే  ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్‌ అయింది. రొటీన్‌ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్‌గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్‌ డెలివరీతో మ్యానేజ్‌ చేశాడు.  శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్‌ ఉండడం మరో ప్లస్‌ పాయింట్‌. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్‌ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెట్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)