Breaking News

ఓటీటీలో సడన్‌ సర్‌ప్రైజ్‌ 'సింగం అగైన్‌' తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌

Published on Sat, 01/18/2025 - 09:09

బాలీవుడ్‌ భారీ యాక్షన్‌ సినిమా 'సింగం అగైన్‌'(Singham Again).  ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్‌ రన్‌ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.  అజయ్‌ దేవ్‌గణ్‌(Ajay Devgn), అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar), రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె, అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్‌ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.

సింగమ్‌, సింగమ్‌ రిటర్న్స్‌, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్‌ కాప్‌ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్‌ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్‌ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్‌ వర్షన్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్‌ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్‌ తెరకెక్కించారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్‌,థమన్  సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ వర్ధంతి.. ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళి)

బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రోహిత్‌ శెట్టి... కాప్‌ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్‌ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్‌, సింగమ్‌ రిటర్న్స్‌, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్‌ అగైన్‌’లో  దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్‌ చెప్పారు. 

చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్‌ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్‌ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్‌ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)