Breaking News

ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్‌ సునీత ఎమోషనల్‌

Published on Thu, 06/12/2025 - 12:59

సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది సింగర్‌ సునీత (Sunitha Upadrashta). మృదువైన స్వరంతో ఆమె పాట పాడితే అమృతం కురిసినట్లే ఉంటుంది. ఈమె మాట్లాడితే కూడా తీయని పాట పాడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాటలెన్నో పాడిన సునీత మనసు నేడు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అందుకు కారణమేంటో చూసేద్దాం..

సునీత భావోద్వేగం
ఏ తల్లికైనా తను సాధించిన విజయాల కంటే పిల్లలు సాధించిన విజయాలే గొప్పగా కనిపిస్తాయి. చేతుల్లో ఆడించిన చంటిపిల్లలు కళ్లముందు ఎదుగుతుంటే ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. సునీత కూతురు శ్రేయ తాజాగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.

ఎంత గర్వంగా ఉందో..
మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా కూతురు ఇప్పుడు ప్రాట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇల్లుస్ట్రేటర్‌గా గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. 

ఫ్యామిలీ ఫోటో.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
నీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. శ్రేయ గ్రాడ్యుయేషన్‌ డేకు సునీత భర్త రామ్‌, కుమారుడు ఆకాశ్‌ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేశారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మొదటి భర్త సంతానమే శ్రేయ
కాగా సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి కూతురు శ్రేయ, కుమారుడు ఆకాశ్‌ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సునీత- కిరణ్‌ విడిపోయారు. 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్‌ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుంది.

 

 

చదవండి: దేవుడి అవతారంలో ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ స్టోరీ ఇదేనా?

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)