Breaking News

సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు.. యాంకర్‌పై సునీత ఫైర్‌

Published on Sat, 09/17/2022 - 12:08

టాలీవుడ్‌ సింగర్‌ సునీత తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాటలతోనే కాకుండా చూడచక్కని రూపంతో హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకుంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన సునీతకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో వందల పాటలు పాడిన సునీత గతేడాది వ్యాపార‌వేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉన్న సునీత తాజాగా వన్‌ మినిట్‌ మ్యూజిక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే సింగర్‌గా ఆమెకు బోలెడంత క్రేజ్‌ ఉన్నా రెండో పెళ్లి విషయంలో సునీతపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ వచ్చిన ట్రోల్స్‌పై మీరేమంటారు అని యాంకర్‌ ప్రశ్నించగా సునీత చాలా ఎమోషనల్‌ అయ్యింది.

కెరీర్‌లో చిత్రగారి తర్వాత 120 హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్‌ చెప్పానని, చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్‌కి కారణమయ్యానంటారు కదా.. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్‌ జీవితం మీద ఎందుకు ఫోకస్‌ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. మన మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ యంకర్‌ను సూటిగా నిలదీసింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)