Breaking News

స్టార్ సింగర్‌కి బెదిరింపు.. తలకు తుపాకీ గురిపెట్టి!

Published on Fri, 07/21/2023 - 18:23

సెలబ్రిటీలని చూసి మనలో చాలామంది కుళ్లుకుంటాం. వాళ్లకేంటి సూపర్ లైఫ్ అని జెలసీ ఫీలవుతుంటాం. అయితే ఈ విషయంలో ప్లస్సులతో పాటే మైనస్సులు కూడా ఉంటాయి. కాకపోతే వాటిని సదరు సెలబ్రిటీలు బయటపెట్టినప్పుడే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ సింగర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పి, అవాక్కయ్యేలా చేశాడు.

పంజాబీలో పలు ఆల్బమ్ సాంగ్స్‌తో పాపులర్ అయిన సింగర్ సుధీర్ యదువంశీ. ఇతడు రీసెంట్‌గా ఓ పెళ్లి సంగీత్‌కి వెళ్లాడు. స్టేజీపై ఉన్న ఇతడి దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఈ గాయకుడే బయటపెట్టాడు. తలకు గన్ గురిపెట్టి మరీ బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్‌)

'సంగీత్ లో ఉన్న నా దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. తను రాసిన పాటని పాడమన‍్నాడు. నేను కుదరదు అని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఎందుకులే అని ఊరుకున్నాను. కొంతసేపటికి స్టేజీపై నుంచి దిగిపోతున్న నన్ను ఫాలో అయ్యాడు. ఒక్కసారిగా నా దగ్గరకొచ్చి సడన్‌గా తుపాకీ బయటకు తీశాడు. నాకు గురిపెట్టి.. పాడతావా లేదా? అని బెదిరించాడు. ఒక్కసారిగా షాకయ్యాను'

'గన్ నావైపు గురిపెట్టడమే కాకుండా.. పాట పాడితేనే స్టేజీ దిగుతావ్ లేదంటే.. అని భయపెట్టాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడ్డాను. చేసేదం లేక.. అతడు చెప్పినట్లే ఆ పాట పాడాను. అది కూడా ఏకంగా మూడుసార్లు' అని సుధీర్ యదువంశీ తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్‌ని తాజాగా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)