Breaking News

సుచీ లీక్స్.. కమల్‌ హాసన్‌పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర

Published on Thu, 05/16/2024 - 11:07

కోలీవుడ్‌లో సుచీ లీక్స్  గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్‌ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్‌ వైరల్‌ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో  హాట్ టాపిప్‌గా మారిన విషయం తెలిసిందే.

కొన్నేళ్ల తర్వాత సింగర్‌ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్‌, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా  కమల్‌ హాసన్‌పై సుచిత్ర  సంచలన ఆరోపణ చేసింది. కమల్‌ హాసన్‌ ట్రాన్స్ జెండర్‌ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్‌ పేల్చింది. తమిళ్‌ బిగ్‌ బాస్‌కు హోస్ట్‌గా కమల్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

గత సీజన్‌లో విక్రమ్‌ సినిమాతో పాపులర్‌ అయిన మాయ కంటెస్టెంట్‌గా పాల్గొంది. కమల్‌తో పాటు మాయ కూడా ట్రాన్స్‌జెండర్స్‌ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్‌, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్‌ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్‌ జెండర్‌తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కమల్‌ హాసన్‌ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్‌ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్  ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్‌ వైట్‌ డ్రెస్‌తో పాటు చుడీదార్‌ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్‌ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. 

సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్‌ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్‌ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)