Breaking News

'దయచేసి ఎవరూ కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు'.. అభిమానులకు సింగర్ విజ్ఞప్తి

Published on Sat, 03/01/2025 - 19:08

ఇటీవల సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో పలువురి సినీతారల అకౌంట్స్‌ను హ్యాకింగ్ గురైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ఎక్స్‌ ఖాతాను హ్యాక్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా సింగర్ వెల్లడించింది. దాదాపు రెండు వారాలైనా తన ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎవరూ కూడా తన ట్విటర్ ఖాతా నుంచి వచ్చే పోస్టులు, లింక్స్‌ను క్లిక్ చేయొద్దని అభిమానులకు సూచించింది.

తన ఇన్‌స్టాలో శ్రేయా ఘోషల్ రాస్తూ..'  నా అభిమానులు, స్నేహితులకు ఒక్కటే విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఎక్స్‌ బృందాన్ని సంప్రదించేందుకు శతవిధాలా ప్రయత్నించా. కానీ ఆటో జనరేటెడ్‌ రెస్పాన్స్‌ల ద్వారా నాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. నా ఖాతాను డిలీట్‌ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయలేకపోతున్నా. కనీసం నా ఖాతా లాగిన్‌ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను ఎవరూ కూడా క్లిక్‌ చేయొద్దు. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేసేజులు, లింకులను క్లిక్ చేయొద్దు.  నా  ఖాతా రికవరీ అయిన వెంటనే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా' అని సింగర్ రాసుకొచ్చింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)